కవితలు


 దేవాదిదేవా శ్రీవాసుదేవా 

భట్టిప్రోలు విజయలక్ష్మి
21. 12. 2025
హైదరాబాద్

దేవాదిదేవా శ్రీ వాసుదేవా
దేవాదిదేవా  శ్రీవాసుదేవా
  
తోషములో సంతోషముతో 
తోషములో సంతోషముతో 
దీనులగాచీ దివ్యుల బ్రోచీ 
పుడమిని శాంతిని నిండుగ నిలిపిన               దేవాదిదేవా శ్రీ వాసుదేవా

ప్రహ్లాదు గాచీ ధ్రువు తార జేసీ 
ప్రహ్లాదు గాచీ ధ్రువు తార జేసీ 
బాలల పాలిటి భాసుడవై, ప్రభాసుడవై  
బాలల మనమున బ్రహ్మము నింపిన            దేవాదిదేవా శ్రీ వాసుదేవా

వస్త్రము నిచ్చీ వస్త్రము దోచీ 
వస్త్రము నిచ్చీ వస్త్రము దోచీ 
వస్త్రము లోనీ శాస్త్రము తెలిసీ 
వస్త్రములో గల పరమార్థము తెలిపిన            దేవాదిదేవా శ్రీ వాసుదేవా
          

మీరాకు కంఠమున రాధకు హృదయమున 
మీరాకు కంఠమున రాధకు హృదయమున 
నటనము సలిపీ కేళిని చూపిన 
నటనము సలిపీ కేళిని చూపిన                    దేవాదిదేవా శ్రీ వాసుదేవా





సత్యసాయి భజన 

భట్టిప్రోలు విజయలక్ష్మి
23. 11. 2020
హైదరాబాద్


సత్యసాయి నామా -------------- సత్యసాయి రామా 
సత్యసాయి నామా -------------- సత్యసాయి రామా 

నిత్య సత్య ధ్యానం -------------- సుప్రకాశ దీపం 
సుప్రకాశ దీపం --------------  సాయి దివ్య నామం 
సాయి దివ్య నామం --------------  రమ్య మార్గ దీపం 
రమ్య మార్గ దీపం --------------  సాయి దివ్య ధ్యానం 
సాయి దివ్య ధ్యానం -------------- సత్యసాయి రూపం 

నిత్య సాయి నామం --------------  నిత్య సత్య రూపం 
నిత్య సత్య రూపం  --------------  నిర్మల ప్రదీపం 
సత్య జ్యోతి రూపం --------------  సత్య శాంతి మార్గం 
సత్య శాంతి మార్గం --------------  ప్రేమ దివ్య రూపం 
సత్య దివ్య వీక్షణం --------------  నిత్య సత్య కటాక్షం 
సత్య సాయి మూర్తీ --------------  నిర్మల సుదీప్తీ 
సత్య సాయి రూపం --------------  దివ్యమార్గ దీపం  
సుప్రకాశ మూర్తీ  -------------- నిత్య తేజో మూర్తీ 
దీప జ్యోతి మూర్తీ --------------  దివ్య మార్గ జ్యోతీ 
సత్య సాయి నామా --------------  సత్య సాయి రామా 

                               సత్య సాయి రామా 



















         


Comments

Popular posts from this blog

గాయత్రీ మంత్రములు Edited

పద్య కాదంబరి --- అష్టోత్తరశతం సేకరణ-విశ్లేషణ ... Dr. నందివాడ(భట్టిప్రోలు) విజయలక్ష్మి