కవితలు
దేవాదిదేవా శ్రీవాసుదేవా భట్టిప్రోలు విజయలక్ష్మి 21. 12. 2025 హైదరాబాద్ దేవాదిదేవా శ్రీ వాసుదేవా దేవాదిదేవా శ్రీవాసుదేవా తోషములో సంతోషముతో తోషములో సంతోషముతో దీనులగాచీ దివ్యుల బ్రోచీ పుడమిని శాంతిని నిండుగ నిలిపిన దేవాదిదేవా శ్రీ వాసుదేవా ప్రహ్లాదు గాచీ ధ్రువు తార జేసీ ప్రహ్లాదు గాచీ ధ్రువు తార జేసీ బాలల పాలిటి భాసుడవై, ప్రభాసుడవై బాలల మనమున బ్రహ్మము నింపిన దేవాదిదేవా శ్రీ వాసుదేవా వస్త్రము నిచ్చీ వస్త్రము దోచీ వస్త్రము నిచ్చీ వస్త్రము దోచీ వస్త్రము లోనీ శాస్త్రము తెలిసీ వస్త్రములో గల పరమార్థము తెలిపిన దేవాదిదేవా శ్రీ వాసుదేవా మీరాకు కంఠమున రాధకు హృదయమున మీరాకు కంఠమున రాధకు హృదయమున నటనము సలిపీ కేళిని చూపిన నటనము సలిపీ కేళిని చూపిన దేవాదిద...